• May 01, 2026
  • NPN Log

    అడ్డగుట్ట : ఈ ఏడాది ఫిబ్రవరిలో హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సీతారామ్‌ కేసు కొలిక్కి వచ్చింది. భార్య వివాహేతర సంబంధాలతో విసిగి, వేసారి సీతారామ్‌ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన సీతారామ్‌కు 2018లో వివాహమైంది. హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఉంటున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఫిబ్రవరి హుస్సేన్‌సాగ్‌లో దూకి చనిపోయే ముందు అతడు రాసిన 19పేజీల సూసైడ్‌ నోట్‌ పోలీసులకు లభించింది. తన భార్య పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుందని.. చెప్పినా వినకపోవడంతోనే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు అతడు ఆ నోట్‌లో పేర్కొన్నాడు. దాని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు సీతారామ్‌ భార్యను, ఆమెతో సంబంధం పెట్టుకున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు.

    సూసైడ్‌ నోట్‌లో ఏముందంటే..

    రెండు లక్షల జీతంతో ఉద్యోగం చేస్తున్న తాను భార్యను కంటికి రెప్పలా చూసుకున్నానని.. పెళ్లయిన ఏడాదికే భార్య అసలు స్వరూపం తెలిసిందని సీతారామ్‌ తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన పలువురితో తన భార్య సంబంధాలు పెట్టుకుందని.. తాను ఉద్యోగానికి వెళ్లిన సమయంలో వారిని ఇంటికి పిలిపించుకునేదని.. వైఖరి మార్చుకోవాలని ఆమెకు పలుమార్లు చెప్పినా ఉపయోగం లేకపోగా.. ‘‘నీ పేరు రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంటా’’ అంటూ తనను బెదిరించిందని వాపోయాడు. ‘‘మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మడం నేను చేసిన తప్పా?’’ అని ఆవేదన వెలిబుచ్చాడు. సోషల్‌ మీడియాలో పరిచయమైన పలువురితో అక్రమ సంబంధాలు పెట్టుకుందని, ఉద్యోగానికి వెళ్లిన సమయంలో వారిని ఇంటికి పిలిపించుకున్నదని పేర్కొన్నాడు. ఆమెతో సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తి ఆ వీడియోలను తన ఇన్‌స్టాగారమ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసినప్పుడు.. వాటిని డిలీట్‌ చేయించడానికి సహకరించాలంటూ తన భార్య తనను కోరిందని వివరించాడు. ‘‘నాభార్య అక్రమ సంబంధాల గురించి ఆమె కజిన్‌కు తెలుసు. ఆమె అన్ని విషయాల్లో నా భార్యకు సహకరించేది. నా భార్య ప్రియుడి చెల్లెలికి కూడా ఈ సంబం ధం గురించి తెలుసు.’’ అని పేర్కొన్నాడు. ‘‘ఎన్నిసార్లు చెప్పినా నా భార్య తీరు మార్చుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. పిల్లలు అన్యాయం అవుతారని తెలిసినా వేరే దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నా’’ అని సీతారామ్‌ సూసైడ్‌ నోట్‌లో స్పష్టంగా వివరించాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement