మూడో టీ20: వైభవ్ విధ్వంసం.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
హరారే వేదికగా భారత్, జింబాబ్వే జట్లు మూడో టీ20లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరగులు చేసింది. జింబాబ్వేకు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(81; 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(2) మరోసారి విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్(29; 26 బంతుల్లో 4 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్(27; 18 బంతుల్లో 2 ఫోర్లు), రింకు సింగ్(25; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనపించారు. తిలక్ వర్మ(11*) నాటౌట్‌గా నిలిచాడు. కాగా జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 2, సికందర్ రజా, ముజరబాని, వెస్లీ తలొక వికెట్ పడగొట్టారు.










Comments