మిలాద్-ఉన్-నబీ సందర్భంగా.. నేటి సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ సిటీ: మిలాద్-ఉన్- నబీ పండగను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 6 నుంచి 26వ తేదీ ఉదయం 4 గంటల వరకు ‘జల్సా’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కింది విధంగా రూట్ మళ్లింపులు మరియు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు
మలక్‌కుంట, బేగంబజార్ ఛత్రి వైపు నుంచి దారూస్సలాం రోడ్డు వైపు వచ్చే వాహనాలను అలస్కా టి-జంక్షన్ వద్ద ఎంజే బ్రిడ్జ్, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.
మల్లేపల్లి ఎక్స్‌రోడ్, బోయగూడ కమాన్, మంగళ్‌హాట్ వైపు నుంచి దారూస్సలాం వైపు వచ్చే వాహనాలను ఆగాపురా ఎక్స్‌రోడ్ వద్ద టక్కర్‌వాడి, చార్మినార్ వైపు మళ్లిస్తారు.
బజార్‌ఘాట్, తాజ్ ఐలాండ్ వైపు నుంచి దారూస్సలాం వైపు వచ్చే వాహనాలను ఏక్‌మినార్ వద్ద బజార్ ఘాట్ మరియు నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
సీతారాంబాగ్, మంగళ్‌హాట్ వైపు నుంచి దారూస్సలాం రోడ్డు వైపు వచ్చే వాహనాలను ఆగాపురా జంక్షన్ వద్ద చార్‌కండిల్ వైపు మళ్లిస్తారు.
మెహిదీపట్నం, ఆసి్‌ఫనగర్ వైపు నుంచి దారూస్సలాం వైపు వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్‌రోడ్ వద్ద గోకుల్ నగర్, బజార్ ఘాట్ వైపు మళ్లిస్తారు.
పార్కింగ్ ఏర్పాట్లు
దారూస్సలాం జల్సా కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు ట్రాఫిక్ రద్దీ కాకుండా వాహనాలను కింద పేర్కొన్న ప్రాంతాలలో పార్క్ చేయాలి.
గవర్నమెంట్ డిస్పెన్సరీ హాస్పిటల్ (సీతారాంబాగ్): 4-వీలర్స్
అఘాదర్గా: 2-వీలర్లు
(ద్విచక్ర వాహనాలు)
సర్దార్ బేగ్ దర్గా: 2-వీలర్లు
(ద్విచక్ర వాహనాలు)
పాన్ మండి రోడ్: 2-వీలర్లు
(ద్విచక్ర వాహనాలు)
ఎస్‌బీఐ రోడ్: 2-వీలర్లు
(ద్విచక్ర వాహనాలు)
రాకెట్ గ్రౌండ్: 4-వీలర్లు








Comments