రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగాలా?
ప్రతి ఒక్కరూ రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగాలనే నియమానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని డాక్టర్లు చెబుతున్నారు. నీటి అవసరం అనేది మనిషి బరువు, చేసే పని, ఉండే వాతావరణంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అందరికీ ఒకే లెక్క సరిపోదని, మన శరీరానికి నీరు కావాలనిపించినప్పుడు ‘దాహం’ రూపంలో సంకేతం ఇస్తుందని వివరించారు. అందువల్ల దాహం వేయకపోయినా బలవంతంగా నీళ్లు తాగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.










Comments