రేవంత్ రెడ్డితో మీనాక్షీ నటరాజన్ భేటీ
తెలంగాణ : CM రేవంత్ రెడ్డితో AICC రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ భేటీ అయ్యారు. ఇటీవల పార్టీలో నెలకొన్న పరిణామాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ, వివిధ కార్పొరేషన్లకు పాలకవర్గాల నియామకాలు వంటి అంశాలపైనా కీలక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రోగ్రాములపైనా సమీక్షిస్తున్నట్లు సమాచారం.










Comments