విమానం ఇంజిన్లలోకి కోళ్లను ఎందుకు విసురుతారు.. ఆసక్తికర కారణమేంటంటే..
ఇటీవలి కాలంలో మన దేశంలో విమానంలో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సాధారణంగా విమానయాన సిబ్బంది భద్రతా పరంగా ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. అందులో కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. విమానం ఇంజిన్లలోకి కోళ్లను విసురుతారు అనే నిజం మీకు తెలుసా? అవును.. విమానం ఇంజిన్లలోకి అప్పుడే చనిపోయిన కోళ్లను విసురుతారు.
విమానం ఇంజిన్లలోకి కోళ్లను విసరడం అనేది ఒక సర్టిఫికేషన్ పరీక్ష. ఈ ప్రక్రియను బర్డ్ స్ట్రైక్ సిమ్యులేషన్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్‌ను కొత్త ఇంజిన్ మోడల్ లేదా విమానం డిజైన్‌ను మొదటిసారి వాణిజ్యపరమైన ఉపయోగం కోసం అనుమతించే ముందు మాత్రమే నిర్వహిస్తారు. విమానం ఎగురుతున్నప్పుడు పక్షి ఢీ కొంటే.. ఇంజిన్, కాక్‌పిట్ విండ్‌షీల్డ్ ఆ తీవ్రమైన ప్రభావాన్ని తట్టుకోగలవా, పెద్ద నష్టాన్ని నివారించగలవా అని నిర్ధారించుకోవడానికి ఈ పరీక్షను నిర్వహిస్తుంటారు. విమాన భాగాలను వాణిజ్య వినియోగం కోసం ఆమోదించే ముందు ప్రపంచవ్యాప్తంగా ఈ పరీక్ష తప్పనిసరిగా చేస్తారు.
టెస్ట్ కోసం ఉపయోగించే కోళ్లను పరీక్షకు ముందు చంపుతారు (aviation safety facts). తద్వారా వాటి ద్రవ్యరాశి, కణజాల సాంద్రత సజీవంగా ఉన్న పక్షికి దగ్గరగా ఉంటాయి. పెద్ద ఇంజిన్‌ను సర్టిఫై చేయడానికి చేసే పరీక్షకు 4-పౌండ్ల (సుమారు 1.8 కిలోగ్రాములు) బరువున్న కోడి అవసరం. పరీక్ష పూర్తయిన తర్వాత, కోళ్లను స్థానిక నిబంధనల ప్రకారం దహనం చేస్తారు లేదా నిర్దిష్ట పద్ధతిలో పారవేస్తారు. మొదటి సారి ఈ పరీక్షను 1905లో బ్రిటిష్ ఏరోస్పేస్ కంపెనీ డి హావిలాండ్ జెట్ ఇంజిన్లను అభివృద్ధి చేసిననపుడు ప్రవేశపెట్టారు.








Comments