వార్త సంస్థలపై నిషేధం విధించిన ట్రంప్.. ఆ సంస్థలకు వైట్‌హౌస్‌లోకి నో ఎంట్రీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు వార్త సంస్థలకు వైట్‌హౌస్‌లోకి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. సీఎన్ఎన్, ఎమ్ఎస్ నౌ, పొలిటికోలకు శ్వేతసౌధంలోకి ఇకపై ప్రవేశం ఉండదని ఆయన తెలిపారు. కల్పితాలు, అబద్ధాలు ప్రసారం చేస్తూ.. ప్రచారం చేస్తునందుకు వాటిపై బ్యాన్ విధించామని వివరించారు. ‘ఈ విషయం చెప్పడానికి నేను గర్వపడుతున్నా.. ఫేక్ న్యూస్ సంస్థలు సీఎన్ఎన్, ఎమ్ఎస్ నౌ, పొలిటికోల వైట్‌హౌస్ ప్రవేశాన్ని నిషేధించా. వారు నిత్యం చేసే ఫేక్ న్యూస్ రిపోర్టింగ్‌కు ఇది ఫలితం’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అయితే నిషేధం వెనుక కారణాలను ఆయన వెల్లడించలేదు.
ఇలాగే కల్పితాలు ప్రచారం చేసే మరికొన్ని సంస్థలపై కూడా బ్యాన్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే వాటి పేర్లను ఆయన చెప్పలేదు. వైట్‌హౌస్ నుంచి మీడియా సంస్థలను నిషేధించడం అరుదు. ట్రంప్ మొదటి సారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే సీఎన్ఎన్ రిపోర్టర్‌ను బ్యాన్ చేశారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఓ కుంభకోణం వివాదంలో వాష్గింటన్ పోస్ట్ సంస్థను నిషేధించారు. కాగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే మీడియాపై ఆంక్షలు విధించారు. నియమ నిబంధనలను కఠినతరం చేశారు.










Comments