• Mar 04, 2026
  • NPN Log

    వేల్పుమడుగు భూ బదిలీపై వివాదంNpn, news, 3:3:2026

    నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు.. సమగ్ర విచారణకు డిమాండ్.

    విడపనకల్ మండలం వేల్పుమడుగు గ్రామం సర్వే నం. 332-Dలో జరిగిన భూ బదిలీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 2024 సెప్టెంబర్ 9న అప్పటి తహశీల్దార్ ఆమోదించిన చేస్తున్నారు. తమ పూర్వీకుల ఆస్తి హక్కులు కాలరాయబడ్డాయని ఆరోపిస్తూ పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరుతున్నారు. పిటిషనర్ కురువ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూమికి సుమారు ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. 1960-61లో బడగొర్ల హౌన్నూరప్ప తన తల్లి లింగమ్మ పేరిట సెటిల్మెంట్ చేయగా, 1961 బహూకరణ పత్రం ప్రకారం 1.87 ఎకరాలు నమోదు అయ్యాయి. అయితే 1982లో ఇదే భూమిని 1.97 ఎకరాలుగా చూపిస్తూ విక్రయించినట్లు రికార్డులు సృష్టించారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండానే నమోదు జరిగిందని, అసలు హక్కుదారుల నుంచి ప్రస్తుత బదిలీ వరకు అవసరమైన అనుసంధాన పత్రాలు లేవని వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పులను వారు ప్రస్తావిస్తున్నారు. సూరజ్ ల్యాంప్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ హర్యానా రాష్ట్రం కేసులో చట్టబద్ధ పత్రాలు లేకుండా ఆస్తి హక్కులు బదిలీ కావని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే బల్వంత్ సింగ్ వర్సెస్ దౌలత్ సింగ్ కేసులో పాత పత్రాలు, స్వాధీన హక్కులను నిరూపించాల్సిన బాధ్యత దావేదారుడిదేనని తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. ఈ తీర్పుల ప్రకారం ప్రస్తుత భూ బదిలీ చెల్లదని వారు అభిప్రాయపడుతున్నారు. ఫిర్యాదుపై స్పందించిన రెవెన్యూ అధికారులు పాత రికార్డులు, అడంగళ్లు, ఫీల్డ్ మ్యాప్ పత్రాలను పరిశీలిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన తేలితే భూ బదిలీని రద్దు చేసే అవకాశముందని సమాచారం. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బాధితులు స్పష్టం చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement