శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి
న్యూఢిల్లీ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాయికుంట గ్రామంలో 100 పడకల ఈఎ్‌సఐ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీని కోసం రూ.16 కోట్ల విలువ చేసే భూమి సేకరణకు కూడా అనుమతి ఇచ్చింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఇప్పటికే కేంద్రం ఆధ్వర్యంలోని సనత్‌నగర్ (హైదరాబాద్) ఈఎ్‌సఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నాచారం, రామచంద్రాపురం, సిర్పూర్ కాగజ్‌నగర్, వరంగల్ ప్రాంతాల్లోని ఈఎస్‌ఐ ఆస్పత్రులు కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్నాయి. శంషాబాద్‌లో 100 పడకల ఈఎ్‌సఐ ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వమే నిర్మించి, కార్మికులకు వైద్య సేవలు అందించనుంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిధిలో 1.32 లక్షలకు పైగా ఈఎ్‌సఐ ఇన్సూరెన్స్ కలిగిన కార్మికులు ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలో పెద్దఎత్తున జరుగుతున్న పారిశ్రామికీకరణ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కార్మికుల సంఖ్య మరింత పెరగనుంది. శంషాబాద్‌లో ఆస్పత్రి నిర్మాణంతో కార్మికులకు, వారి కుటుంబాలకు చేరువలోనే వైద్య సేవలు లభించనున్నాయి. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీ, మాండవీయకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.









Comments