వచ్చే 4 రోజులు మరింత చలి
తెలంగాణ : రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 18 నుంచి 21 వరకు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లా దామరంచలో 10 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డి పేటలో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.










Comments