ఇంటర్ కాలేజీల రీఓపెన్ రోజే విద్యార్థులకు బుక్స్!
తెలంగాణ : ప్రభుత్వ కాలేజీల రీఓపెన్ రోజే విద్యార్థులకు బుక్స్ ఇవ్వాలని ఇంటర్మీడియట్ కమిషనరేట్ అధికారులు నిర్ణయించారు. పుస్తకాలను ఏప్రిల్ నుంచే మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూ.కాలేజీల్లో 1.70 లక్షల మంది చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం ఆగస్టు-అక్టోబర్ మధ్య ఫ్రీగా బుక్స్ అందిస్తోంది. ఆలస్యం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఈసారి ముందే సిద్ధం చేయనుంది.










Comments