సంప్రదాయ సేద్యం - సాంకేతిక అధ్యయనంబీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్
కొత్త విత్తనాల అభివృద్ధి నుంచి దిగుబడుల పెంపు వరకు అవసరమైన శాస్త్రీయ పరిశోధనలు చేపట్టడమే కాదు, ఫలితాలను రైతులకు అందించడంలో మన వ్యవసాయ విద్యాలయాలు ఆది నుంచి అద్వితీయమైన కృషి చేస్తున్నాయి. అదేవిధంగా అవి అందిస్తున్న ప్రాథమిక కోర్సు బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతో ఇంటర్ ఉత్తీర్ణులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. కోర్సు లోతుల్లోకి వెళితే....
బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని అంశాలను బోధిస్తారు. అగ్రానమీ, క్రాఫ్ ప్రొడక్షన్, ప్లాంట్ బ్రీడింగ్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రి కెమిస్ర్టీ, ఎంటమాలజీ, అగ్రి ఎకనామిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, ప్లాంట్ పాథాలజీ, హార్టికల్చర్, అగ్రి ఎక్స్టెన్షన్, స్టాటిస్టిక్స్, అగ్రికల్చరల్ మైక్రో బయాలజీ, బయో కెమిస్ర్టీ, యానిమల్ హజ్బెండరీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, అగ్రో ఫారెస్ర్టీ, సీడ్ టెక్నాలజీ తదితర అంశాలు బోధనలో భాగం.
ప్రతి కోర్సుకు ప్రాక్టికల్స్ ఉంటాయి. దానిని క్రెడిట్ అవర్స్ సిస్టమ్ అని సంబోధిస్తారు. వారానికి ఒక సబ్జెక్టుకు సంబంధించి థియరీ రెండు గంటలు, ప్రాక్టికల్స్ ఐదు గంటలు ఉంటాయి. మూడు సంవత్సరాలు థియరీ, నాలుగో ఏడాదిలో ఐదు నెలలు రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్సీపీరియన్స్(రావె) ప్రోగ్రామ్, ఆరు నెలలపాటు అగ్రికల్చరల్ ఎక్సీపీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్(ఏఈఎల్పీ), ఒక నెల అగ్రి ఇండస్ర్టియల్ అటాచ్మెంట్ ఉంటాయి.
ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్లో భాగంగా ఆరు నుంచి ఎనిమిది మంది విద్యార్థులను ఒక గ్రూపుగా చేసి, వారికి అభిరుచి గల సబ్జెక్టులో వ్యాపార నిర్వహణకు చేయూతనిస్తారు. అందుకు కావాల్సిన పెట్టుబడిని యూనివర్సిటీ సమకూరుస్తుంది. తద్వారా వచ్చిన లాభంలో 50శాతాన్ని విద్యార్థులకే అందిస్తారు.
ఉన్నత చదువులో భాగంగా ఎమ్మెస్సీలో సాయిల్ సైన్స్, అగ్రానమి, ప్లాంట్ ఫిజియాలజీ, బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్, వ్యవసాయ అర్థశాస్త్రం వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆపై పీహెచ్డీ కూడా చేయవచ్చు.
బీ.ఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ పూర్తిచేసిన విద్యార్థులకు అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, అగ్రికల్చరల్ ఆఫీసరు; బ్యాంకులలో ఫీల్డ్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీటితోపాటు సీడ్, ఫెస్టిసైడ్ కంపెనీల్లోనూ అవకాశాలు ఉంటాయి.










Comments