హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం.. అసభ్యంగా ప్రవర్తించిన యువకులు..
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. లూలూ మాల్‌లో కొంతమంది యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్లు తాకుతూ హీరోయిన్‌ను ఇబ్బందికి గురి చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ‘రాజాసాబ్’ సినిమాలోని రెండో పాట విడుదల కార్యక్రమం నిన్న( బుధవారం) హైదరాబాద్‌లోని లూలూ మాల్‌లో జరిగింది. నిధి అగర్వాల్ ఆ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత హీరోయిన్ బయటకు వచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. వారిని కంట్రోల్ చేయటం నిధి సిబ్బంది వల్ల కాలేదు. కొంతమంది యువకులు ఇదే అదునుగా భావించారు.
నిధిని చుట్టుముట్టి అసభ్యంగా తాకసాగారు. చుట్టు ముట్టిన జనం కారణంగా ఆమె ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది జనాన్ని పక్కకు తోసి నిధిని కారు దగ్గరకు తీసుకెళ్లారు. కొన్ని అడుగుల దూరం వెళ్లడానికి నిధి చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ సంఘటనపై ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. ఆ యువకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో. .‘కొంతమంది మగాళ్ల గుంపు హైనాల కంటే దారుణంగా ప్రవర్తించింది. హైనాలను కూడా ఎందుకు అవమానించాలి. చెత్త బుద్ధి కలిగిన మగాళ్లను ఒక చోట పెడితే.. ఆడవాళ్లతో ఇలానే ప్రవర్తిస్తారు. దేవుడు వీళ్లను తీసుకెళ్లి వేరే వేరే గ్రహాల్లో పడేయాలి’ అంటూ ఫైర్ అయింది. కాగా, ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమా జనవరి 9వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా ముగ్గురు హీరోయిన్స్ నటించారు.









Comments