హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!
తెలంగాణ : హోలీ పండగను క్యాష్ చేసుకునేందుకు సైబర్ కేటుగాళ్లు రెడీ అయ్యారు. రంగులు, గిఫ్ట్స్, ఈవెంట్ పాస్‌ల మీద భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ వాట్సాప్, SMSలలో ఫేక్ లింకులు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని ఆమె సూచించారు.









Comments