అంటు వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తం: సత్యకుమార్
తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకొవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రామాణిక మార్గదర్శకాలను (ఎస్వోపీ) రూపొందించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైద్య సేవలు అందించేందుకు ఎలా సిద్ధమవ్వాలి? వచ్చినప్పుడు వైద్యులు ఎలా స్పందించాలి? తుఫాన్ అనంతరం వ్యాధులు ప్రబలకుండా, పునరావాస, ఇతర చర్యలు ఎలా తీసుకొవాలన్న దానిపై ఎస్వోపీ సిద్ధం చేశామన్నారు. రాష్ట్రానికి మొంథా తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారులకు పంపించామని తెలిపారు. ఆస్పత్రుల్లో సరిపడా యాంటీ బయాటిక్స్, యాంటి స్నేక్ వీనమ్, ర్యాబిస్ డోస్‌లు నిల్వ ఉంచుకోవాలన్నారు. పీహెచ్‌సీల్లో 500 మందికి సరిపడా పాము కాటు మందు డోసులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. బాధిత ప్రాంతాల్లో వైద్య శిబిరాల నిర్వహణ, అంటు వ్యాధులు ప్రబలకుండా, నీరు కలుషితం కాకుండా, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. 108, 104, 102 అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.










Comments