బిగ్‌బాస్9 నుంచి.. వైల్డ్‌కార్డ్ రమ్య మోక్ష అవుట్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్ నుంచి ఊహించని ఎలిమినేషన్ జరిగింది. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన రమ్య మోక్ష కంచర్ల తన తక్కువ రోజుల ప్రయాణాన్నే ముగించుకుని హౌస్ నుంచి బయటకు వచ్చింది.
'అలేఖ్య చిట్టి పికెల్స్' ఫేమ్‌గా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న రమ్య మోక్ష, వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి అడుగుపెట్టింది. తన ఎనర్జిటిక్ మరియు ముక్కుసూటి స్వభావంతో హౌస్‌లో త్వరగానే హైలైట్ అయింది. ఫిజికల్ టాస్కుల్లో గట్టి పోటీ ఇవ్వగలిగినప్పటికీ, కొన్ని విషయాల్లో ఆమె వ్యవహరించిన తీరు, ముఖ్యంగా తోటి కంటెస్టెంట్లపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఆమెకు ప్రేక్షకుల నుంచి నెగెటివిటీని తెచ్చిపెట్టాయి.
ఈ వారం నామినేషన్స్‌లో రమ్య మోక్షతో పాటు మరికొందరు కంటెస్టెంట్లు ఉన్నారు. ఆన్‌లైన్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం, ఈ వారం రమ్య మోక్షకు ఓట్లు అశించిన స్థాయిలో రాలేదు. తనూజ పుట్టస్వామి ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో, ఆమెను హౌస్ నుంచి బయటకు పంపాలని ప్రేక్షకులు నిర్ణయించుకున్నట్లు ఓటింగ్ ఫలితాల ద్వారా స్పష్టమైంది.
రమ్య మోక్ష ఎలిమినేషన్‌తో, హౌస్‌లో ఆమె కొద్ది రోజులు మాత్రమే ఉండగలిగింది. ఆమె నిష్క్రమణతో ఆట మరింత రసవత్తరంగా మారింది. హౌస్‌లో రమ్య మోక్ష తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తన యాటిట్యూడ్‌తో చర్చనీయాంశం కావడం వల్ల చాలా మంది ఆమె ఆట మరింత కాలం ఉంటుందని భావించారు. అయితే, ప్రజల తీర్పును బట్టి ఆమె ప్రయాణం త్వరగానే ముగిసింది.







Comments