అధిక ఫీజులు దోపిడి చేస్తున్నటువంటి నారాయణ విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలి, ( PDSU ) నారాయణ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అమ్మకాలను అరికట్టాలి. *నారాయణ సంస్థల (జి.ఎం) పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి,* *పీ.డీ.ఎస్.యూ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నారాయణ పాఠశాల దగ్గర ధర్నా,*
5-6-202*ఈరోజు రాయదుర్గం డివిజన్ :- ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యాసంస్థల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న పీ.డీ.ఎస్.యూ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ రాయదుర్గం డివిజన్ కార్యదర్శి మహీంద్రా మాట్లాడుతూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేని నారాయణ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని. అదే విధంగా విచ్చలవిడిగా అకాడమిక ప్రారంభం కాక ముందే ముందస్తు అడ్మిషన్లు చేస్తూ విద్యాసంస్థల్లోనే పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్ అమ్మకాన్ని తక్షణమే ఆపాలని. ఇలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అడ్మిషన్లు సేకరిస్తూ ఫీజుల దోపిడీలను చేస్తూ విద్యా సంస్థలను పాఠ్యపుస్తకాలు యూనిఫాంలో అమ్ముతున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని.ఆ యొక్క పాఠశాల యొక్క గుర్తింపును రద్దు చేసి ఆ యొక్క పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని.ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU గా డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ రాయదుర్గం డివిజన్ కార్యదర్శి మహీంద్రా పీడీ ఎస్ యూ నాయకులు వంశీ, అబ్దుల్, సుబ్బు, మణికంఠ, సురేష్, నవీన్ తదితరులు పాల్గొనడం జరిగింది.*









Comments