• Jun 05, 2026
  • NPN Log

    ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నాలుగవ శుక్రవారం  కార్యక్రమం మార్కాపురం పట్టణంలోని కంభం రోడ్ లో శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యుల వారు సైకిల్ పై విచ్చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం విజయ సునీత గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు గారు, జిల్లా డిఆర్ఓ ఎం శివరాం రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
    అనంతరం శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ పీజిఆర్ఎస్ కార్యక్రమం గత నాలుగు వారాల నుండి ప్రతి శుక్రవారం ప్రజల నుండి అర్జీలు స్వీకరించి కొన్ని సమస్యలకు పరిష్కారం చూపామని అతి త్వరలో మిగతా అర్జీలకు పరిష్కారం చూపుతామని అన్నారు. ఈరోజు 76 అర్జీలు వచ్చాయని వాటికి త్వరలోనే పరిష్కారం చూపిస్తామని అన్నారు.
    ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement