ఇవాళ అతిభారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ : మొంథా తీవ్ర తుఫానుతో రాష్ట్రంలో ఇవాళ అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.










Comments