డేటా లీక్.. వెంటనే పాస్వర్డ్స్ మార్చుకోండి!
భారీ డేటా ఉల్లంఘనలో 183 మిలియన్లకు పైగా ఈమెయిల్ పాస్‌వర్డ్‌లు లీక్ అయినట్లు ఆస్ట్రేలియా సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ ధ్రువీకరించారు. వీటిలో Gmail ఖాతాల వివరాలు కూడా ఉన్నాయి. మాల్‌వేర్ ద్వారా దొంగిలించిన లాగిన్ ఐడీలతో మొత్తం 3.5 టెరాబైట్ల (875 HD సినిమాలకు సమానం) డేటాను హ్యాకర్స్ రూపొందించారు. మీ ఖాతా వివరాలు లీక్ అయ్యాయో లేదో తనిఖీ చేసుకుని, వెంటనే పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని ట్రాయ్ సూచించారు.










Comments