ఉగాది ఉత్సవాల్లో మల్లన్న స్పర్శ దర్శనాలు రద్దు
శ్రీశైలం : ఉగాది ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనాలు పూర్తిగా రద్దు చేసి, అందరికీ అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంచుతున్నట్టు పాలకమండలి చైర్మన్ పోతుగుంట రమే్‌షనాయుడు, ఈఓ శ్రీనివాసరావు సంయుక్తంగా వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 63 భక్త బృందాలు, స్వచ్ఛంద సేవా సంఘాల ప్రతినిధులతో ఆదివారం పరిపాల నా భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు రోజుకు నాలుగు విడతలుగా ప్రతి స్లాటుకు 1,500 టిక్కెట్లు కరెంట్ బుకింగ్, ఆన్‌లైన్‌లో 500 టిక్కెట్లు భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు.









Comments