• Mar 02, 2026
  • NPN Log

    విశాఖపట్నం( పశ్చిమ నియోజకవర్గం )

     

     తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం ప్రభుత్వ విప్ గణ బాబు  పలు వాటిల్లో పేదలకు చీరలు పంపిణీ ఇతర కార్యక్రమాలలో పాల్గొన్నారు.నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల సమర్పించి ఘన నివాళి అర్పించారు. 90,60,91,56 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీని మరో మరింత బలోపేతం చేసి ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉండే విధంగా చేయాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా గణబాబు మీడియాతో మాట్లాడుతూ నట విభీషణుడు,తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని నిలిపిన మహనీయుడు నందమూరి తారక రామారావు సేవలను కొనియాడారు. కేంద్ర ప్రభుత్వానికి దీటుగా నిలబడి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపిన మహనీయుడు. ప్రతి తెలుగు వాడి గుండెల్లో చిరస్మరణీయుడిగా వెలుగుతాడని ఈ సందర్భంగా తెలిపారు. 60వార్డ్ శ్రీహరిపురం పేదలకు చీరలు పంపిణీ మరియు 91 వార్డ్ లో పటోజు చిన్నారావు కు సీఎం రిలీ ఫండ్ చెక్ సుమారుగా 38,727/- ను అందించడం జరిగింది. 
    ఈ కార్యక్రమంలో పాల్గున్న టీడీపీ కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్,బొమ్మిడి రమణ,గల్లా చిన్న,శరగడం రాజశేఖర్, మరియు టీడీపీ జిల్లా నాయకులు,వార్డ్ నాయకులు,మహిళా నాయకులు ,కార్యకర్తలు మొదలగున్నవారు పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement