ఎస్బీఐలో మరో 3500 ఆఫీసర్ల కొలువులు
న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్‌బీఐ) తన వ్యాపార, ఖాతాదారుల సేవలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందుకోసం వచ్చే ఐదు నెలల్లో మరో 3,500 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం మూడు దశల పరీక్ష తర్వాత వీరి ఎంపిక ఉంటుందని ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ (హెచ్‌ఆర్) కిశోర్ కుమార్ పోలుదాసు చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటికే 505 పీఓ పోస్టుల భర్తీ పూర్తయిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆఫీసర్లు, క్లరికల్ పోస్టులతో కలుపుకుని 18,000 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఇంతకు ముందే ప్రకటించారు. ఐటీ, సైబర్ సెక్యూరిటీ విభాగాల కోసం ఎస్‌బీఐ ఇప్పటికే 1,300 నిపుణుల నియామకం పూర్తి చేసింది.










Comments