ఒంటిమిట్ట చెరువుకు చేరుతున్న వరద
ఒంటిమిట్ట: కడప జిల్లాలోని అతిపెద్ద చెరువులలో ఒకటైన ఒంటిమిట్ట చెరువుకు శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వరదనీరు వచ్చి చేరుతుంది. గత నాలుగు సంవత్సరాలుగా ఒంటిమిట్ట చెరువులో నీరు లేక బోసిపోయింది. కుడమలూరులోని ఎత్తిపోతల పథకంపై రైతులు నమ్మకాన్ని వదిలేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం కరుణించక పోయిన వరుణ దేవుడు కరుణించి ఒంటిమిట్ట చెరువుకు నీరు అందించాడు. చెరువుకు వస్తున్న వరదలు చూసి రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు
Comments