గర్భిణీలకు పోషక ఆహారం తప్పనిసరి
ఒంటిమిట్ట: గర్భం దాల్చిన ప్రతి మహిళకు పోషక ఆహారం తప్పని సరి అని ఒంటిమిట్ట పిహెచ్ సి డాక్టర్ అరుణ జ్యోతి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెన్నపేరూరు పంచాయతీలో సర్పంచ్ లక్ష్మీనరసయ్య ఆధ్వర్యంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని ఆమె వైద్య సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందు లో చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్, గర్భిణీలకు పరీక్షలు, పంటి, కంటి, క్యాన్సర్, బిపి, షుగర్ పరీక్షలు జరిపించారు. అలాగే గర్భవతులకు పోషక ఆహారాల పదార్థాలను అందజేసి, వాటి ఉపయోగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ భాస్కరరెడ్డి, సిహెచ్వోలు హవిల, చంద్రిక , శిరీష, స్త్రీ ఆరోగ్య కార్యకర్తలు రేష్మా సోనీ, నాగమణి, ఉమాదేవి, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments