ఒరాకిల్ ఝలక్.. 30,000 మందికి లేఆఫ్స్
AI, డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్న సాఫ్ట్వేర్ సంస్థ ఒరాకిల్ తమ ఉద్యోగులను మరోసారి తొలగిస్తోంది. తమకు లేఆఫ్స్ మెయిల్స్ వచ్చినట్లు పలువురు ఉద్యోగులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. ఈ కంపెనీకి భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా 1,62,000 మంది ఉద్యోగులు ఉండగా దాదాపు 18% అంటే 20,000 నుంచి 30,000 మందిని తొలగిస్తోందని నివేదికలు చెబుతున్నారు. 2023 నుంచి పలుమార్లు ఒరాకిల్ లేఆఫ్స్ ప్రకటించింది.









Comments