ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా: ఎలీసా హీలీ
మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో టీమిండియా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. భారత్ చేతిలో కంగుతిన్న ఆస్ట్రేలియా కెప్టెన్ ఎలీసా హీలీ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన తమ జట్టు ప్రదర్శన ‘అన్-ఆస్ట్రేలియన్’గా ఉందని ఆవేదన చెందింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలిపింది.
‘టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 338 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించాం. అయినప్పటికీ మరో 30 పరుగులు ఎక్కువ చేయాల్సింది. మా ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్. మా బౌలర్లు కూడా సరిగ్గా బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా జెమీమా రోడ్రిగ్స్ ఇచ్చిన సులువైన క్యాచ్‌లను నేను, ఆ తర్వాత మెక్‌గ్రాత్ వదిలేయడం మ్యాచ్ గతిని మార్చేసింది. రోడ్రిగ్స్ అద్భుతమైన నాక్ ఆడింది. మంచి అవకాశాలను మేమే సద్వినియోగం చేసుకోలేకపోయాం. కారణాలు ఏవైనా గెలుపును చేతులారా చేజార్చుకున్నాం. గత 15 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లలో అజేయంగా ఉన్న ఆసీస్, ఇలా కీలక దశలో ఓడిపోవడం.. 2017 ఓటమిని గుర్తు చేసింది. ఈ పరాజయాన్ని గుణపాఠంగా తీసుకుని, భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణిస్తాం’ అని హీలీ వ్యాఖ్యానించింది.









Comments