కూతురిపై అత్యాచారానికి యత్నించాడని కొట్టిచంపిన తండ్రి!
తన కూతురిపై అత్యాచారానికి యత్నించిన కామాంధుడిని రాయితో కొట్టి చంపాడో తండ్రి. ఒడిశాలోని థెన్‌కనల్ జిల్లాలో జరిగిందీ ఘటన. కాలువలో స్నానం చేసేందుకు తండ్రితో కలిసి బాలిక (10) వెళ్లింది. స్నానం ముగించుకున్నాక పక్కకు వెళ్లిన సమయంలో కరుణాకర్ (27) అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఏడుపు విన్న తండ్రి వచ్చి బండరాయితో కొట్టి చంపాడు. తర్వాత స్థానిక పర్జంగ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
Comments