కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన మీనాక్షి
తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నటుడు, డాక్టర్ అవ్వకూడదని హీరోయిన్ మీనాక్షి చౌదరీ అన్నారు. అంతేకాకుండా మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచి ఉండకూడదని తెలిపారు. ఎందుకంటే తాను ఇప్పటికే ఆ హోదాల్లో ఉన్నానని చెప్పారు. అయితే తన ఫేవరెట్ డిష్ రాజ్మా 100 ఎకరాల్లో పండించే వ్యక్తి కావాలని తెలిపారు. హైట్ ఉండటంతో పాటు కుకింగ్ తెలిసి ఉండాలన్నారు. కాగా ఆమె నటించిన ‘అనగనగా ఒక రాజు’ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.










Comments