కార్తీక సోమవారం: ఉపవాసం ఎందుకు ఉండాలి?
కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉండి, నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేస్తే శివుడి అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ నియమం పాటించడం సాధ్యం కానివారు కనీసం ఒక్క కార్తీక సోమవారమైనా ఉపవాసం ఉండాలంటున్నారు. దీనివల్ల శరీరానికి స్వస్థత చేకూరుతుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటున్నారు. ఇంద్రియ నిగ్రహానికి సైతం ఉపవాసాన్ని మించిన సాధనం మరొకటి లేదని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.









Comments