కార్మికుల శ్రమతోనే రాష్ట్రాభివృద్ధి
అమరావతి : కార్మికుల శ్రమతోనే రాష్ట్రాభివృద్ధి పునాదులు నిర్మితమవుతాయని, అందువల్ల కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. శుక్రవారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి కూటమి రెండేళ్ల పాలనలో కార్మిక శాఖ పురోగతిని వివరించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని సామాజిక బాధ్యతగా, అభివృద్ధి లక్ష్యంగా భావించి పని చేస్తున్నదని చెప్పారు. గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో కార్మిక సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు.










Comments