సిరిసిల్ల ఎస్పీపై బండి సంజయ్ ఆగ్రహం.. ఎందుకంటే..
రాజన్న సిరిసిల్ల : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గీతేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ‘మన బడి – మన బాధ్యత’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేశ్ బి. గీతే హాజరు కాకపోవడంపై బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాత్రమే ఉండటంతో.. ‘ఎస్పీ ఎందుకు రాలేదు?’ అని ప్రశ్నించారు. తాను సాధారణ కార్యకర్తను కాదని, కేంద్రమంత్రిగా పాల్గొంటున్న కార్యక్రమానికి జిల్లా పోలీసు అధికారి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీ ఎస్పీకి బీఆర్ఎస్‌పై అంత ప్రేమ ఎందుకు?’ అని ప్రశ్నించారు. అవసరమైతే బీఆర్ఎస్‌లో చేరాలని వ్యంగ్యంగా అన్నారు. అధికార యంత్రాంగం రాజకీయ పక్షపాతం లేకుండా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని బండి సంజయ్ ఆదేశించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.









Comments