ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్‌ది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్
హైదరాబాద్ : భారత గగనతల రక్షణ వ్యవస్థలో ఎయిర్‌ఫోర్స్ పాత్ర చాలా కీలకమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌లో కూడా ఎయిర్ వారియర్స్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. భవిష్యత్తులో భారత రక్షణ కోసం ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో రెండోరోజు రాజ్‌నాథ్ సింగ్ పర్యటించారు. ఈరోజు(శనివారం) ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
యుద్ధంలో సాంకేతిక వినియోగం పెరిగింది..
ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్ ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్యాడెట్‌లు శిక్షణ తీసుకున్నారని.. ఇప్పటి నుంచి మీరు దేశ సేవలో పాల్గొనాలని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగిందని.. దీన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ ప్రపంచంలో అనునిత్యం అప్రమతంగా ఉండటం చాలా ముఖ్యమని తెలిపారు. ఎలాంటి యుద్ధ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. నిమిషాల్లోనే కాదని సెకండ్స్‌లోనే దేశ రక్షణ కోసం తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవవసరం ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఈ బాధ్యత దేశ ప్రజలందరి నమ్మకమని కేంద్రమంతి తెలిపారు. భవిష్యత్తులో ఎయిర్‌ఫోర్స్‌కి వచ్చే యువకులకు ఆదర్శంగా నిలవడం చాలా ముఖ్యమని అన్నారు. దేశసేవకు వారి పిల్లలను అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. క్యాడెట్లు అందరూ కూడా ఆకాశాన్నే తమ ఇల్లుగా మలుచుకుని, ఆకాశమే హద్దుగా దేశసేవలో నిమగ్నం కావాలని రాజ్‌నాథ్ సింగ్ సూచించారు.









Comments