‘కేరళం’ సరే.. ప్రాజెక్టులేవీ: శశి థరూర్
కేరళ పేరును ‘కేరళం’గా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై ఎంపీ శశి థరూర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మలయాళంలో ఇప్పటికే కేరళం అనే పిలుస్తారని, ఇప్పుడు ఆ పదాన్ని ఇంగ్లీషులోకి తీసుకురావడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. పేరు మార్పుపై చూపిస్తున్న శ్రద్ధను రాష్ట్ర అభివృద్ధిపై చూపడం లేదని విమర్శించారు. బడ్జెట్లో కేరళకు ఒక్క కొత్త ప్రాజెక్టూ ఇవ్వలేదని, AIIMS వంటి కీలక సంస్థలను కేటాయించలేదని ఆరోపించారు.










Comments