సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ : సీఎం రేవంత్‌పై ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు తనదైన శైలిలో మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ‘మునుగోడుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు. విద్యావ్యవస్థలో మార్పులు తెస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసింది’ అని అన్నారు. మరోవైపు హైదరాబాద్‌కు పక్కనే ఉన్న మునుగోడును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉందని పేర్కొన్నారు.










Comments