• Jun 13, 2026
  • NPN Log

    అమరావతి : ఏపీ.. గ్రీన్‌ ఎనర్జీ క్యాపిటల్‌గా ఎదుగుతోందని ‘గ్రీన్‌ ఇండియా కాన్ఫరెన్స్‌-2026’లో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో ఏపీ చాంబర్స్‌, ఎగ్జిబిషన్‌ క్యాటలి స్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పరిశ్రమల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైౖర్మన్‌ పీ కృష్ణయ్య మాట్లాడుతూ, ‘వచ్చే దశాబ్ద కాలంలో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యం. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం హరిత ఇంధన విధానాల ను అమలు చేస్తోంది. లక్ష్యం దిశగా వేగంగా సాగుతోంది. తయారీ, ఎనర్జీ స్టోరేజీ, సెల్‌ ఫ్యాబ్రికేషన్‌, మాడ్యూల్‌ అసెంబ్లీ, ప్రాజెక్టు సేవల రంగాల్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు అపారమైన అవకాశాలు ఉన్నాయి’ అని తెలిపారు. ఏపీ చాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ... ‘రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.5 లక్షల కోట్లకు పైగా పునరుత్పాదక ఇంధన పెట్టుడులను ఆకర్షించింది. మరో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement