‘జన నాయగన్’ వాయిదా.. రీరిలీజ్‌తో వస్తోన్న విజయ్
జన నాయగన్ సినిమా విడుదల వాయిదా పడటంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు దళపతి విజయ్ గుడ్‌న్యూస్ చెప్పారు. సూపర్‌హిట్ సినిమా తేరీ (తెలుగులో పోలీసోడు)ను జనవరి 15న తమిళనాడులో రీరిలీజ్ చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ వి.క్రియేషన్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.










Comments