తుఫాను.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు
ఆంధ్రప్రదేశ్ : తుఫానుపై కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సిఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, 25 కేజీల బియ్యం సహా నిత్యావసరాల పంపిణీ చేయాలని ఆదేశించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగిపోకుండా చూడాలని, ప్రజలెవరూ బయటకు రాకుండా చూసుకోవాలని తెలిపారు.










Comments