• Nov 01, 2025
  • NPN Log

    నేషనల్ క్రష్ రష్మికా మందణ్ణ , దీక్షిత్ శెట్టి  ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో థర్డ్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'లాయీ లే...' అంటూ సాగే ఈ పాటను హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వర పర్చగా, రాకేందు మౌళి రాశారు. దీన్ని కపిల్ కపిలన్ అద్భుతంగా పాడారు. అమాయకురాలైన అమ్మాయిని తెలివిగా ఎర వేసే ఉచ్చులోకి లాగే కపట ప్రేమికులు ఉంటారని ఈ పాట ద్వారా చెప్పకనే చెప్పాడు దర్శకుడు. ఈ పాటలో హీరో మనస్తత్త్వాన్ని అన్యోపదేశంగా చెప్పారు. దాంతో హీరో, హీరోయిన్ల మధ్య ఉండే బంధాలు ఎలా ఉంటాయనే విషయంలో ఆడియెన్స కు అవగాహన ఏర్పడుతుంది.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement