ఘనంగా.. 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్ వివాహం
టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవంత్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు అఖిలను శుక్రవారం వివాహం చేసుకున్నాడు. ఈ విజయంతో అభిషన్ కోలీవుడ్ హిట్ యంగ్ దర్శకుల జాబితాలో చోటు దక్కించుకోవడంతో పాటు సూపర్‌స్టార్ రజనీకాంత్ వంటి అగ్రనటుల ప్రశంసలు కూడా పొందారు. ఈ నేపథ్యంలో తన చిన్ననాటి ప్రియురాలు అఖిల ను శుక్రవారం వివాహం చేసుకున్నాడు. స్థానిక పోయెస్ గార్డెన్లో వీరిద్దరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అతికొద్దిమంది సినీ ప్రముఖుల సమక్షంలో కోలాహలంగా జరిగింది.
ఈ వివాహాన్ని పురస్కరించుకుని 'టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత రెండు రోజుల క్రితం ఓ ఖరీదైన BMW కారును గిఫ్ట్‌గా ఇవ్వగా సంబంధిత న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మరోవైపు అభిషన్ హీరోగా నటించిన తమిళ చిత్రం సైతం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతుండడం విశేషం.








Comments