నేనూ కుల వివక్షను ఎదుర్కొన్నా: భట్టి
తెలంగాణ : రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చినప్పటికీ అంటరానితనం తగ్గలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ తాను కూడా జీవితంలో కుల వివక్షను ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. ‘కులం అనేది సామాజిక వాస్తవం. దీన్ని అంగీకరించి మార్పు దిశగా అడుగులు వేయాలి. ఉన్నత విద్యావంతులూ కుల అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ సామాజిక సమానత్వం కోసం ప్రయత్నిస్తోంది’ అని చెప్పారు.










Comments