• Jun 13, 2026
  • NPN Log

    కరీంనగర్ : రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. శుక్రవారం కరీంనగర్‌లోని హుజురాబాద్‌లో హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌‌ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అధికారం కోల్పోయాయని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదని వంద కోట్ల రూపాయిలతో ఇంకో ప్యాలస్ నిర్మించారని ఆరోపించారు.

    ఇంటి సమీపంలో హెలికాప్టర్ చాలదని ఐదు కోట్ల రూపాయిలతో ఎయిర్ బస్ తెచ్చుకుంటున్నారని మండిపడ్డారు. ఫుట్ బాల్ సోకుల కోసం మెస్సీకి రూ.100 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. అందాల పోటీల కోసం మరో రూ.100 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఇక్కడి నుంచి అక్కడికి మూటలు పంపటానికి నగదు ఉంటుందన్నారు. కానీ విద్యార్థులు, రైతులకు ఇవ్వటానికి మాత్రం డబ్బులు ఉండవా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి‌కి హరీశ్ రావు చరకలంటించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement