నారా రోహిత్ పెళ్లి వేడుకల్లో బాలయ్య సందడి
నారా ( వారింట పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నా విషయం తెల్సిందే. సినీ, రాజకీయ ప్రముఖులతో నారా వారిల్లు కళకళలాడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాయుడు తమ్ముడు కొడుకు, హీరో నారా రోహిత్ పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెల్సిందే. ప్రతినిధి 2 సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ శిరీష లేళ్లను ప్రేమించి ఇరు కుటుంబ వర్గాలను ఒప్పించి ఈ జంట అక్టోబర్ 30 న పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
ఇక గతేడాది వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు అక్టోబర్ 30 న వీరి వివాహాం కూడా అంగరంగ వైభవంగా జరగనుంది. అక్టోబర్ 25 నుంచే నారావారింట పెళ్లి వేడుకలు మొదలు అయ్యాయి. ఇప్పటికే పసుపు దంచడం, హల్దీ వేడుక ముగిసింది.నిన్న రోహిత్ - శిరీష ల హల్దీ వేడుక ఘనంగా జరిగింది. నందమూరి - నారా కుటుంబాలు కలిసి ఈ వేడుకను మరింత ఘనంగా జరిపించారు.
ఇక నేడు నారా రోహిత్ ను పెళ్లి కొడుకును చేసే వేడుక జరగనుంది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ కుటుంబ సమేతంగా హాజరయ్యాడు. నారా లోకేష్, బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర, నందమూరి అక్కాచెల్లెళ్లు అందరూ పాల్గొని రోహిత్ ను పెళ్లి కొడుకును చేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నేడు రోహిత్ ను పెళ్లి కొడుకును చేయడం పూర్తయితే.. అక్టోబర్ 28 న మెహందీ వేడుక ఉంటుంది. ఇక అక్టోబర్ 29 సంగీత్ జరగనుంది. చివరగా అక్టోబర్ 30 న రోహిత్ - శిరీష ల వివాహం జరగనుంది.







Comments