‘ప్రాజెక్ట్ కుశ’.. గేమ్ చేంజర్
అల్వాల్ : దేశీయంగా అభివృద్ధి చేస్తున్న గగనతల రక్షణ వ్యవస్థ ‘ప్రాజెక్ట్ కుశ’ దేశ భద్రతా చిత్రపటాన్నే మార్చేసే గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్లో నిర్వహించిన అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రాజెక్ట్ కుశ ప్రపంచ స్థాయి స్వదేశీ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ అని.. ఆపరేషన్ సిందూర్ సమయంలో దాని సత్తా తెలిసిందని పేర్కొన్నారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి బ్రజ్ ప్రాంత ప్రజలను రక్షించినట్టే.. మన వైమానిక రక్షణ వ్యవస్థ కూడా ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశానికి రక్షణ కవచంలా పనిచేసిందని కొనియాడారు. అలాగే.. దేశ రక్షణ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని రాజ్నాథ్తెలిపారు. డీఆర్డీవో ప్రయోగశాలలు, రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్ట్‌పలు, ఎంఎ్‌సఎంఈలు, విద్యాసంస్థలు గతంలో ఎప్పుడు లేనంతగా సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. ఈ సహకార విధానం ఆవిష్కరణల నుంచి ఉత్పత్తి వరకు, ఉత్పత్తి నుంచి కార్యాచరణ సామర్థ్యం వరకూ భారత ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.










Comments