• Mar 02, 2026
  • NPN Log

    రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం, వర్కింగ్‌ జర్నలిస్టుల ఆరోగ్య పథకం పరిధిలోకి వచ్చే పౌరులు మినహా..ప్రతి ఒక్కరికీ సార్వత్రిక ఆరోగ్య బీమా అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు. మండలిలో టీడీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి ఆయన జవాబిచ్చారు. రాష్ట్రంలో యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్యూరెన్స్‌ పాలసీని హైబ్రిడ్‌ విధానంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద మొత్తం కోటీ 63 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని, దారిద్య్ర రేఖకు దిగువనున్న ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుందని, దారిద్య్ర రేఖకు ఎగువనున్న కుటుంబాలకు ఏడాదికి రూ.2.50 లక్షల బీమా కవరేజీ వర్తిస్తుందని వివరించారు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement