ప్రపంచ శాంతి సూచీలో భారత్‌కు 127వ స్థానం
న్యూఢి : ప్రపంచం అంతా అశాంతి రాజ్యమేలుతోంది. మన దేశంలో కూడా శాంతి క్షీణించింది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్(ఐఈపీ) తాజాగా విడుదల చేసిన ప్రపంచ శాంతి సూచీ (జీపీఐ)లో భారత్ 127వ స్థానంలో నిలిచింది. గతేడాది 115వ స్థానంలో నిలిచిన మన దేశం.. ఈ ఏడాది 12 స్థానాలు కోల్పోయింది. దీనికి అంతర్గత కలహాల వల్ల పెరిగిన మరణాలు, పొరుగు దేశాలతో క్షీణించిన సంబంధాలు కారణాలు. ఏడాది కాలంలో పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, మయన్మార్ సరిహద్దులో అస్థిరత పెరిగాయి. మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య వైరం కారణంగా జరుగుతున్న హింస భారత్ ర్యాంక్‌పై ప్రభావం చూపింది. ఈ ఏడాది 163 దేశాలకు ర్యాంకులు విడుదల చేశారు. జీపీఐ ప్రకారం 2026లో ప్రపంచంలోనే టాప్ 10 శాంతియుత దేశాల్లో ఐస్‌ల్యాండ్, న్యూజిల్యాండ్, స్విట్జర్లాండ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ జాబితాలో నేపాల్ 111 స్థానంలో, బంగ్లాదేశ్ 117వ స్థానంలో, పాకిస్థాన్ 152వ స్థానంలో ఉన్నాయి.










Comments