బాత్రూమ్లో జారి పడి.. పైకి లేవ లేని స్థితిలో ఒంటరిగా షావుకారు జానకి కుమార్తె!
దివంగత సీనియర్ నటి షావుకారు జానకి కుటుంబంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆమె పెద్ద కుమార్తె యజ్ఞప్రభ (76) చెన్నైలోని తన నివాసంలో వీల్‌చైర్ నుంచి కిందపడి లేవలేని స్థితిలో చిక్కుకుపోయారు. ఒంటరిగా ఉన్న ఆమె ఆపదలో చిక్కుకున్న తీరు, చివరకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి కాపాడటంతో బయటపడిన వైనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..
దివంగత ప్రముఖ నటి షావుకారు జానకి పెద్ద కుమార్తె యజ్ఞప్రభ (76) ఒంటరిగా ఉంటున్న ఇంట్లో వీల్ చైర్‌లో నుంచి కింద పడి లేవలేక నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది తలుపులు పగులగొట్టి ఆమెను రక్షించారు. షావుకారు జానకి(94) రెండు నెలల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, యజ్ఞప్రభ ఇటీవలే కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. యజ్ఞప్రభ పిల్లలు అమెరికాలో ఉంటుడంగా.. ఆమె చెన్నైలోని దురైపాక్కంలో ఓ అపార్ట్మెంట్‌లో ఒంటరిగానే విశ్రాంతి తీసుకుంటున్నారు.
సోమవారం ఉదయం బాత్రూమ్‌కు వెళ్లివస్తూ వీల్‌చైర్ నుంచి జారిపడ్డారు. పైకి లేవ లేని స్థితిలో బిగ్గరగా కేకలేసినా.. ఇంటి తలుపులు మూసి ఉండడంతో ఎవరికీ వినిపించలేదు. అతికష్టం మీద సెల్‌ఫోన్ వద్దకు చేరుకొని బంధువులకు సమాచారం అందించారు. వారిచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి యజ్ఞప్రభను కాపాడారు.







Comments