• Oct 27, 2026
  • NPN Log

    తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాట మరోసారి చర్చలు జోరందుకున్నాయి. వచ్చే నెలలో జరగనున్న దీపావళిని పురస్కరించుకుని తన అభిమానులకు ముఖ్యంగా మహిళలకు ధనుష్ ఇచ్చిన వెండి దీపపు ప్రమిదలు కొత్త చర్చకు దారితీశాయి. ఆదివారం తన అభిమాన సంఘం.. 'నర్పణి ఇయక్కమ్' ఆధ్వర్యంలో మహిళా విభాగం సభ్యులకు ఆయన వెండి 'కామాక్షి' దీపాల ప్రమిదలను కానుకగా ఇచ్చారు.

    ఆ దీపాల అడుగు భాగంలో కమలం పువ్వును ముద్రించారు. అయితే, ఈ గుర్తు బీజేపీ  ఎన్నికల చిహ్నం కావడంతో ధనుష్ రాజకీయ ప్రవేశంపై సామాజిక మాధ్యమాల్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. ఇప్ప‌టికే 'తమిళగ ఎళుచ్చి కళగం పేరుతో కొత్త పార్టీని ఉంబోతుంద‌ని వార్తలు ఉన్న నేప‌థ్యంలో తాజా స‌మావేశం త‌మిళ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

    ఇప్పటికే అభిమాన సంఘాన్ని పునర్ వ్యవస్థీకరించి, కొత్త జెండా ఆవిష్కరించిన ధనుష్. రాజకీయాల్లోకి రాబోతు న్నారన్న ప్రచారానికి ఈ 'కమలం దీపం' మరింత జోరు పెంచింది. తాజాగా ధనుష్ 'నర్పణి మండ్రం' పేరును 'ధనుష్ నర్పణి ఇయక్కం (ధనుష్ సంక్షేమ ఉద్యమం)గా మార్చారు. ఆ సంస్థ మహిళా విభాగం చెన్నై శివారులోని తారైపాక్కంలో ఆదివారం భేటీ అయింది.

    సుమారు 3 నుంచి 5 వేల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన నటుడు ధనుష్ మహిళలకు వెండి ప్రమిదలను కానుకగా అందించారు. కాగా, ఈ ప్రమిదలపై 'కమలం' గుర్తు వివాదాస్పదం కావడంతో దనుష్ అభిమానులు వివరణ ఇచ్చారు. "ఆ చిహ్నం తయారీదారుల ముద్ర మాత్రమే. దానికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు." అని చెప్పినట్లు తెలిసింది.

    అందులో తప్పేముంది

     

    నటుడు ధనుష్ వెనుక బీజేపీ ఉంటే తప్పేముందని? అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. మదురైలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం బీజేపీ కూటమిలో అన్నాడీఎంకే కొనసాగుతుందన్నారు. ప్రపంచ నేతగా ప్రధాని మోదీ పేరుగాంచారని అలాంటి పార్టీతో ధనుష్ ఉంటే ఎలాంటి తప్పు లేదన్నారు. బీజేపీ నేతలతో ధనుష్ మాట్లాడడంపై ఇప్పవరకు ఎలాంటి సమాచారం లేదని, ఒకవేళ ఉంటే ఏం తప్పు ఉందన్నారు.

    నటుడు ధనుష్ రాజకీయ పార్టీ ప్రారంభంపై ఇంకా స్పష్టత లేదని, ప్రస్తుతం ఆయన తన అభిమానులు, మహిళా సంఘాలతో సమావేశం అవుతున్నారని తెలిపారు. ఆస్తులు కాపాడేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకు అన్నాడీఎంకే నుంచి పలువురు నేతలు అధికార టీవీకేలోకి వెళ్లారన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నేతల్లా కాకుండా, 100 మంది కార్యకర్తల్లో ఒకటిగా ఉన్నారని అన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వారు తిరిగి సొంత గూటికి చేరుకునే కాలం రానుందని దిండుగల్ శ్రీనివాసన్ తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement