• Oct 27, 2026
  • NPN Log

    హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న తల్లీకూతుళ్లు జమున బ్యాద్ (38), మాలతి బ్యాద్ (20)ను జీఆర్పీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 70 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జీఆర్పీ పోలీస్ స్టేషన్‌కు వారిని తరలించి.. విచారించారు. నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో అనారోగ్యానికి గురైన భర్తకు చికిత్స చేయిస్తున్నట్లు జమున వెల్లడించిందని పోలీసులు తెలిపారు.

    వైద్య ఖర్చులు పెరగడంతో వారు చోరీ బాట పట్టినట్లు వివరించారు. నిందితుల స్వస్థలం పశ్చిమ బెంగాల్ బర్ధమాన్ జిల్లా అని పేర్కొన్నారు. గచ్చిబౌలిలో రూమ్ అద్దెకు తీసుకున్న జమున బ్యాద్.. తన భర్తకు చికిత్స చేయిస్తుందని చెప్పారు. రైల్వే స్టేషన్‌లో వారు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని.. దీంతో అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. తమ విచారణలో చోరీలకు పాల్పడుతున్నట్లు వారు నేరాన్ని అంగీకరించారని జీఆర్పీ పోలీసులు వివరించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement