రుక్కు రుక్కు రుక్మిణి.. కిట్టయ్యకి నువ్వే అలివేణి
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ ఎన్నాళ్లగానో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న విషయం తెల్సిందే. ఇక ఎట్టకేలకు నితిన్ హిట్ కోసం న్యాచురల్ స్టార్ నానితో చేతులు కలిపాడు. నితిన్ హీరోగా నాని నిర్మిస్తోన్న చిత్రం అలియాస్ రుక్మిణీ. మురళీ కాంత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ అండ్ వినోదాత్మక చిత్రంలో నితిన్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆఫియా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ కి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.
ఈ సినిమా నుంచి మేకర్స్ రుకు రుకు రుక్మిణి అంటూ సాగే సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. కేవలం కొన్ని సెకన్ల నిడివితో వచ్చిన ఈ ప్రోమోలోని పెప్పీ మ్యూజిక్, క్యాచీ లిరిక్స్ ప్రేక్షకులను తక్షణం ఆకట్టుకుంటున్నాయి. విజయ్ బుల్గానిన్ అందించిన ఎనర్జిటిక్ ట్యూన్స్ పాటకు మంచి ప్లస్ పాయింట్‌గా మారాయి. ఈ చిత్రంలో ఆఫియా ఒక టీచర్ గా కనిపించగా.. నితిన్ ఒక రైటర్ గా కనిపించాడు. రుక్మిణీ కేవలం కిట్టయ్యకే సొంతం అనేవిధంగా ఉన్న లిరిక్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి.







Comments